📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Today Gold Price భారీగా తగ్గిన బంగారం ధరలు..

Author Icon By Anusha
Updated: August 21, 2025 • 1:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారం అంటే భారతీయులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు ఏవైనా బంగారం లేకుండా పూర్తవ్వవు. పెట్టుబడిగా కూడా బంగారం ఎప్పుడూ సురక్షితమని భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరల మార్పులు ఎల్లప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. తాజాగా బంగారం ధరలు (Gold Prices) వరుసగా మూడో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు, పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలకమైన సమావేశం జరగబోతోంది. వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం మార్కెట్లను ప్రభావితం చేయనుంది. పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్‌ నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు.

మునుపటి కంటే కొంచెం చౌకగా

అలాగే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. యుద్ధం ముగిసే అవకాశం కనిపిస్తోందనే ఆశతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలన్నీ గ్లోబల్ మార్కెట్‌లో ఊహించని మార్పులను తెచ్చాయి.గురువారం కూడా బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ధరల తగ్గుదల కారణంగా ఇవాళ్టి గోల్డ్‌, సిల్వర్ (Gold, Silver) మునుపటి కంటే కొంచెం చౌకగా మారాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,140గా ఉంది. 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,790గా ఉంది. ఇక కిలో కిలో వెండి ధర రూ. 1,24,900లకు చేరుకుంది.

Latest News

రాష్ట్రాలవారీగా ధరలు

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,290లుగా ఉంది. అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.91,940లుగా ఉంది.ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.,100,140లుగా ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.91,790 ఉంది.చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,140ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,790 గా ఉంది.బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,140లు ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.91,790 గా ఉంది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,00,140 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,790 లుగా ఉంది.విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,01,180, 22 క్యారెట్ల ధర రూ.92,750 లుగా ఉంది.ఇక, ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే.. పసిడితో పాటుగానే వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. వెండి గ్రాము ధర రూ.124.90లు ఉండగా, కిలో వెండి ధర రూ. 1,24,900లు ధర పలుకుతోంది.గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

బంగారం ధరలు ఎలా నిర్ణయించబడతాయి?

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, సరఫరా, డాలర్ విలువ, వడ్డీ రేట్లు, రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

బంగారం పెట్టుబడిగా మంచిదా?

అవును. బంగారం దీర్ఘకాలిక పెట్టుబడికి సురక్షితంగా భావిస్తారు. మార్కెట్‌లోని హెచ్చుతగ్గుల సమయంలో కూడా ఇది స్థిరంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/gold-rate-today-gold-rates-have-fallen-again/today-gold-rate/533011/

bullion market festival gold gold gold investment gold price indian gold market Telugu News wedding gold

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.