Gold Silver Prices Today : ఎంసీఎక్స్ మార్కెట్‌లో సోమవారం (డిసెంబర్ 8) ఉదయం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడం, స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ బలహీనంగా ఉండటం దీనికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, అమెరికన్ డాలర్ బలహీనత మరియు ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో బంగారం ధరల్లో పడిపోవడం పరిమితమైంది.
ఉదయం సుమారు 9:10 గంటల సమయానికి MCX గోల్డ్ (ఫిబ్రవరి కాంట్రాక్ట్) ధర 0.04 శాతం తగ్గి 10 గ్రాములకు ₹1,30,409 వద్ద ట్రేడైంది. అదే సమయంలో MCX సిల్వర్ (మార్చి కాంట్రాక్ట్) ధర 1 శాతం పడిపోయి కిలోకు ₹1,81,600గా నమోదైంది.
మునుపటి సెషన్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.30 శాతం పెరిగి ₹1,30,462 వద్ద స్థిరపడగా, వెండి మార్చి ఫ్యూచర్స్ దాదాపు 3 శాతం ఎగబాకి ₹1,83,408 వద్ద ముగిశాయి. సెషన్‌లో వెండి ధరలు ఆల్‌టైమ్ హై అయిన ₹1,85,234ను కూడా తాకాయి.
Read Also: Kavitha: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు
ఫెడ్ సమావేశం ముందు ఊగిసలాట
యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశం డిసెంబర్ 10న జరగనున్న నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ ఊగిసలాట కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా (Gold Silver Prices Today) ఉండటంతో పాటు, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
ఫెడరల్ రిజర్వ్‌కి కీలకమైన ద్రవ్యోల్బణ సూచిక అయిన పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ (PCE) సెప్టెంబర్ నెలలో 0.3 శాతం పెరిగింది. ఏడాదికి ఏడాది పోలిస్తే ఈ సూచీ 2.8 శాతంకి చేరింది.
CME ఫెడ్‌వాచ్ సాధనం ప్రకారం, డిసెంబర్ 10న 25 బేసిస్ పాయింట్ల రేట్ కట్ జరిగే అవకాశం 88 శాతానికి పైగా ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో డాలర్ సూచీ ఆరు వారాల కనిష్ట స్థాయి దగ్గర 98.76 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ఇతర కరెన్సీల్లో బంగారం తక్కువ ధరకు అందుబాటులోకి వస్తోంది.
నిపుణుల ట్రేడింగ్ సలహా (Gold Silver Prices Today)
ఫెడ్ పాలసీ నిర్ణయం వరకూ బంగారం, వెండి ధరల్లో తీవ్ర అస్తిరత్వం కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.
ప్రిత్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, (Gold Silver Prices Today) బంగారాన్ని ₹1,29,800 – ₹1,29,000 పరిధిలో కొనుగోలు చేయవచ్చని, ₹1,27,700 కంటే దిగువకు స్టాప్ లాస్ పెట్టుకోవాలని సూచించారు. లక్ష్యాలు ₹1,31,200 మరియు ₹1,32,000గా తెలిపారు.
అలాగే వెండిని ₹1,81,500 – ₹1,79,500 వద్ద కొనుగోలు చేసి, ₹1,76,600 కింద స్టాప్ లాస్ ఉంచాలని, లక్ష్యాలుగా ₹1,85,500 మరియు ₹1,88,000ను పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: