हिन्दी | Epaper
పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే?

Gold price today : బంగారం ధర తగ్గింది, మహిళలకు గుడ్‌న్యూస్ | వెండి రూ.3000 పతనం

Sai Kiran
Gold price today : బంగారం ధర తగ్గింది, మహిళలకు గుడ్‌న్యూస్ | వెండి రూ.3000 పతనం

Gold price today : మహిళలకు ఊరటనిచ్చే వార్త ఇది. గత రెండు రోజులుగా భారీగా పెరిగి ఆందోళన కలిగించిన బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. దీంతో పసిడి కొనుగోలుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. మరోవైపు వెండి ధర కూడా ఒక్కరోజులోనే రూ.3000 వరకు పడిపోవడం గమనార్హం. జనవరి 4వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో బంగారం మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అంతేకాదు, పెట్టుబడి సాధనంగానూ బంగారంపై ఆసక్తి ఎక్కువైంది. గత 2025లో అంతర్జాతీయ అనిశ్చితులు, యుద్ధాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు, సుంకాల ప్రభావంతో బంగారం ధరలు ఏకంగా 70 శాతానికి పైగా పెరిగిన సంగతి తెలిసిందే.

Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?

ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు నిన్న (Gold price today) కూడా భయపెట్టాయి. అయితే ఈరోజు జనవరి 4న బంగారం ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 7 డాలర్లు పెరిగి 4,332 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు కూడా పెరిగి ఔన్సుకు 72.82 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.380 తగ్గి ప్రస్తుతం రూ.1,35,820 వద్ద ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.350 తగ్గి రూ.1,24,500 వద్ద ట్రేడవుతోంది.

బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఇవాళ కిలో వెండి ధర రూ.3000 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్లో రూ.2,57,000కి చేరింది. ఇటీవలి కాలంలో రూ.2.80 లక్షలు దాటిన వెండి ధరలు లాభాల స్వీకరణ కారణంగా ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఈ రేట్లు జనవరి 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉన్నవని గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పన్నులు, ప్రాంతాల ఆధారంగా ధరల్లో మార్పులు ఉండొచ్చు. కాబట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870