Hyderabad gold rate : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. గత వారం చివర్లో పెరిగిన పసిడి ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,200 తగ్గి రూ. 1,43,400కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా గోల్డ్, సిల్వర్ ధరలు దిగజారడంతో దేశీయ మార్కెట్‌పై ప్రభావం పడింది.
భారతదేశంలో బంగారం అలంకరణతో పాటు పెట్టుబడిగా కూడా ముఖ్యమైన ఆస్తిగా భావించబడుతుంది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 34,000 టన్నుల బంగారం నిల్వలుగా ఉందని అంచనా. దీని విలువ దేశ జీడీపీని మించే స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా నిలుస్తుంది. ఇదే కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
Read Also: Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి
దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 1,310 తగ్గి రూ. 1,56,440 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే కిలో వెండి ధర రూ. 15,000 తగ్గి హైదరాబాద్‌లో రూ. 2.65 లక్షలకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4,930 డాలర్లకు పడిపోయింది. గత సెషన్‌లో ఇది 5,000 డాలర్లకు పైగా ఉండేది. సిల్వర్ ధర కూడా ఔన్సుకు 74 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం సుమారు ₹90.70 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ ధోరణులను అనుసరించి సమీప రోజుల్లో ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: