Telugu News: Gold rates:మహిళలకు శుభవార్త – ఒక్కరోజులో బంగారం ధరల్లో భారీ తగ్గుదల!

Read Time:  1 min
Gold rate drop news
Gold rate drop news
FONT SIZE
GET APP

దేశంలో బంగారం ధరలు(Gold rates) ఇటీవల నిరంతరంగా పెరుగుతూ వస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్న వేళ, ఒక్కసారిగా బంగారం ధరలు(Gold rates) తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 తగ్గి ప్రస్తుతం రూ.1,22,460గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,12,250గా నమోదైంది.

Read Also: Montha Cyclone:తుఫాన్‌ వేగం పెరుగుతోంది – ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలెర్ట్

Gold rates
Gold rates:మహిళలకు శుభవార్త – ఒక్కరోజులో బంగారం ధరల్లో భారీ తగ్గుదల!

వివిధ నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాముల కొద్దీ):

  • విజయవాడ: 24 క్యారెట్ల బంగారం – ₹1,22,460 | 22 క్యారెట్ల బంగారం – ₹1,12,250
  • చెన్నై: 24 క్యారెట్ల బంగారం – ₹1,23,280 | 22 క్యారెట్ల బంగారం – ₹1,13,000
  • ముంబై: 24 క్యారెట్ల బంగారం – ₹1,22,460 | 22 క్యారెట్ల బంగారం – ₹1,12,250
  • ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం – ₹1,23,420 | 22 క్యారెట్ల బంగారం – ₹1,13,140
  • అహమ్మదాబాద్: 24 క్యారెట్ల బంగారం – ₹1,23,320 | 22 క్యారెట్ల బంగారం – ₹1,13,040
  • బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం – ₹1,22,460 | 22 క్యారెట్ల బంగారం – ₹1,12,250

నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్(Dollar) బలపడటం, గ్లోబల్ ఎకానమీ మార్పులు, సెంట్రల్ బ్యాంకుల పాలసీలు వంటి అంశాలు బంగారం ధరల్లో ఈ తేడాలకు కారణమవుతున్నాయి.

ప్రస్తుతం బంగారం ధర ఎందుకు తగ్గింది?
అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, జియోపాలిటికల్ ప్రభావాలు ధరలు తగ్గడానికి కారణమయ్యాయి.

ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా?
గ్లోబల్ పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు సంభవించే అవకాశం ఉంది, కానీ దీర్ఘకాలంలో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.