Gold price today : ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య కూడా బంగారం ధరలు పెద్దగా పెరగకపోవడం మార్కెట్‌లో ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపుతారు. కానీ ఈసారి ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారం ఆకర్షణను తగ్గించాయి. దీంతో ఫిబ్రవరి చివరి నుంచి బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.
Read Also: Indane Gas New Booking Numbers: ఇండేన్ గ్యాస్ కొత్త బుకింగ్ నంబర్లు ఇవే!

అయితే తాజాగా మార్కెట్‌లో మళ్లీ స్వల్ప రికవరీ కనిపిస్తోంది. మార్చి 18 ఉదయం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.1,44,900కు చేరగా, 24 క్యారెట్ల బంగారం రూ.1,58,080 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా రూ.4,000 పెరిగి కిలోకు రూ.2.80 లక్షలకు చేరింది. విజయవాడలో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో ధరల్లో మరింత మార్పులు ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: