Gold Price Rate 03/02/26 : దేశవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు గరిష్ఠాల నుంచి క్రమంగా పడిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడి, డాలర్ బలపడటం, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ ప్రభావంతో బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 3 నాటికి 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.15,316 వద్ద స్థిరపడగా, 22 క్యారెట్ ధర రూ.14,039, 18 క్యారెట్ ధర రూ.11,487గా నమోదైంది.
అంతర్జాతీయ పరిణామాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను 25% నుంచి 18%కి తగ్గించడంతో కమోడిటీ మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగాయి. దీంతో బంగారం ధరలు కొంత ఒత్తిడికి లోనయ్యాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,53,320గా ఉండగా, ఇటీవల నమోదైన రికార్డు ధరలతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో కూడా బంగారం ధరలు దిగజారాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం డాలర్ బలం, గ్లోబల్ టెన్షన్లు తగ్గడం, ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు ధరల పతనానికి కారణమవుతున్నాయి.
వివాహాలు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఇది కొంత ఊరటగా భావిస్తున్నారు.
Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం
నగరాల వారీ బంగారం ధరలు :
| నగరం | 24 క్యారెట్ (10గ్రా) | 22 క్యారెట్ (10గ్రా) | 18 క్యారెట్ (10గ్రా) |
|---|---|---|---|
| ఢిల్లీ | ₹1,53,320 | ₹1,40,550 | ₹1,15,030 |
| ముంబై | ₹1,53,170 | ₹1,40,400 | ₹1,14,880 |
| చెన్నై | ₹1,52,180 | ₹1,39,500 | ₹1,20,000 |
| బెంగళూరు | ₹1,53,170 | ₹1,40,400 | ₹1,14,880 |
| హైదరాబాద్ | ₹1,53,170 | ₹1,40,400 | ₹1,14,880 |
| కోల్‌కతా | ₹1,53,170 | ₹1,40,400 | ₹1,14,880 |
| అహ్మదాబాద్ | ₹1,53,220 | ₹1,40,450 | ₹1,14,930 |
| పుణే | ₹1,53,170 | ₹1,40,400 | ₹1,14,880 |
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: