Gold rate hyderabad : బంగారం, వెండి ధరలు సామాన్యులను షాక్‌కు గురి చేస్తున్నాయి. రోజుకో రికార్డ్‌ను సృష్టిస్తూ ధరలు ఊహించని స్థాయికి చేరుతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర రూ.5,000కు పైగా పెరగగా, వెండి ధర కిలోకు ఏకంగా రూ.4 లక్షల మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు అదుపు తప్పుతున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా విధిస్తున్న సుంకాలు, డాలర్ బలహీనత, యుద్ధ భయాలు వంటి అంశాలు బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన (Gold rate hyderabad) పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో ధరలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో జనవరి 29న హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు భారీగా పెరిగి 5519 డాలర్ల స్థాయికి చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ ధర కూడా 11 శాతం పైగా పెరిగి ఔన్సుకు 118 డాలర్లకు పైగా ట్రేడవుతోంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఒక్కరోజులోనే రూ.5,130 పెరిగి రూ.1,67,080కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.4,700 పెరిగి రూ.1,53,150గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.13,000 పెరుగుదలతో రూ.4,00,000 మార్క్‌ను దాటింది.
గమనిక: ఇవి జనవరి 29, గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. బులియన్ మార్కెట్‌లో ధరలు రోజంతా మారవచ్చు. జీఎస్టీ తదితర పన్నుల కారణంగా ప్రాంతాల వారీగా ధరల్లో తేడాలు ఉండవచ్చు. కొనుగోలు ముందు స్థానిక మార్కెట్ ధరలు తెలుసుకోవడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: