Gold rate today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊహించని షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర భారీగా పెరిగింది.
తులం బంగారం రూ.1.50 లక్షలు దాటింది
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.2300 పెరిగింది. దీంతో తులం బంగారం ధర సుమారు రూ.1,50,000 మార్క్‌ను తాకింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,63,640 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 21 డాలర్లు పెరిగి 5171 డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర కూడా స్వల్పంగా పెరిగింది.
Read Also: TVK Party : విజయ్ సరికొత్త పాలిటిక్స్
బంగారం పెరిగినా వెండి స్థిరం
బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరల్లో మాత్రం మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది.
ధరలు పెరగడానికి కారణం ఏమిటి?
ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ మార్పులు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :