Gold rate today : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజూ భారీగా తగ్గుతూ కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారాయి. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ఈసారి బంగారం ధరలు పెరగకుండా తగ్గడం గమనార్హం. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారం నుంచి బాండ్‌ల వైపు మళ్లుతున్నారు. దీంతో నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు రూ.12 వేల వరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా తగ్గి ఔన్స్‌కు 4494 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
Read Also: Coconut Prices Drop Today AP: యుద్ధం అక్కడ.. కష్టం ఇక్కడ: కొబ్బరి రైతుల ఆవేదన!

హైదరాబాద్‌లో గోల్డ్, సిల్వర్ రేట్లు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.2,940 తగ్గి రూ.1,45,970 వద్దకు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.2,750 తగ్గి రూ.1,33,800 వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.30 వేల వరకు తగ్గగా, ఈరోజు ఒక్కరోజే రూ.10 వేల తగ్గి రూ.2,50,000 వద్దకు చేరింది. ధరలు ఇంకా మారే అవకాశం ఉండటంతో కొనుగోలుదారులు స్థానిక మార్కెట్ రేట్లను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: