“2026లో బంగారం రేట్లు(Gold price) ఎంతవరకు పెరుగుతాయ్?” ఈ ప్రశ్న గూగుల్(Google)లో ఇప్పుడు భారతీయ వినియోగదారులు అత్యధికంగా శోధిస్తున్న విషయాల్లో ఒకటి. పసిడి ధరలు ఇప్పటికే భారీ ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో వాటి దిశ ఏంటనే ఉత్కంఠ పెరిగింది. కొనుగోలుదారులే కాదు, మార్కెట్ నిపుణులు కూడా ఇదే అంశంపై చురుకుగా చర్చిస్తున్నారు.
Read Also: Gold Rate in India : ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా మెరుపులు..
గోల్డ్‌మన్ శాక్స్(Goldman Sachs) విడుదల చేసిన తాజా నివేదిక ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. ప్రపంచంలోని 900కి పైగా ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లపై జరిపిన సర్వేలో దాదాపు 70% మంది వచ్చే ఏడాది బంగారం ధరలు మరోసారి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొంటుండటం, అలాగే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషించారు. ఈ ఏడాదిలోనే బంగారం 61% పెరిగి 4,000 డాలర్ల మార్కును దాటడం గమనార్హం.
డిసెంబర్ 1న భారత మార్కెట్లో కూడా బంగారం రేట్లు మళ్లీ పైకెక్కాయి.
- 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹66 పెరిగి ₹13,048
- 22 క్యారెట్లు గ్రాముకు ₹60 పెరిగి ₹11,960
- 18 క్యారెట్లు గ్రాముకు ₹49 పెరిగి ₹9,786
హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,30,480గా నమోదైంది. చెన్నైలో ఈ ధర అత్యధికంగా ₹1,31,670కు చేరగా, ఢిల్లీలో ₹1,30,630గా ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: