Gold Price Today : దేశీయంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. గత ఒక వారంలో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ బంగారం ధర వారం వ్యవధిలో రూ.3,980 పెరగగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.3,650 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో పసిడి రేట్లకు డిమాండ్ పెరుగుతోంది.
నవంబర్ 30న దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,29,970గా నమోదైంది. హైదరాబాద్‌లో అదే ధర రూ.1,29,820కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,169.88 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Smriti Mandhana: స్మృతి–పలాశ్ పై న్యూ అప్‌డేట్
ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు (₹ / 10 గ్రాములు)
- ఢిల్లీ: 22 క్యారెట్ – ₹1,19,150 | 24 క్యారెట్ – ₹1,29,970
- ముంబై: 22 క్యారెట్ – ₹1,19,000 | 24 క్యారెట్ – ₹1,29,820
- చెన్నై, కోల్కతా, హైదరాబాద్: 22 క్యారెట్ – ₹1,19,000 | 24 క్యారెట్ – ₹1,29,820
- జైపూర్, లక్నో, చండీగఢ్: 22 క్యారెట్ – ₹1,19,150 | 24 క్యారెట్ – ₹1,29,970
డిసెంబర్ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బంగారానికి మరింత బలమిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే బాండ్లపై ఆకర్షణ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల (Gold Price Today)
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. వారం రోజుల్లో వెండి ధరలు రూ.21,000 పెరిగి, కిలో ధర రూ.1,85,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర ఔన్సుకు 53.81 డాలర్లకు చేరింది.
‘రిచ్ డ్యాడ్ పూర్ డ్యాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి వెండి ధర త్వరలో 70 డాలర్లకు, 2026 నాటికి 200 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: