Gold rate drop news : మహిళలకు శుభవార్త, ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు!

Read Time:  1 min
Gold rate drop news
Gold rate drop news
FONT SIZE
GET APP

Gold rate drop news : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా రేట్లు దిగొస్తుండటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పతనమవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఆభరణాలుగా ధరించడమే కాకుండా పెట్టుబడిగా కూడా బంగారాన్ని ఎక్కువగా భావిస్తారు. అయితే ఇటీవల గోల్డ్, సిల్వర్ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. జనవరి చివరి వారంలో భారీగా తగ్గిన ధరలు, కొద్ది రోజులు పెరిగి ఇప్పుడు మళ్లీ పడిపోయాయి.

Read Also: AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

Gold rate drop news
Gold rate drop news

అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4,750 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఇది 5,000 డాలర్ల స్థాయిని తాకగా, ఫిబ్రవరి ప్రారంభంలో ఒక్కసారిగా 4,600 డాలర్ల వరకు పడిపోయింది. అక్కడి నుంచి కాస్త కోలుకున్నప్పటికీ ఇంకా ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. వెండి ధర మరింత ఆందోళనకరంగా మారింది. ఒక్కరోజులోనే 20 శాతానికి పైగా పడిపోయి, ఒక దశలో 64 డాలర్ల వరకు దిగివచ్చింది. ప్రస్తుతం సిల్వర్ రేటు సుమారు 70 డాలర్ల వద్ద ఉంది.

ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉదయం 10 గంటల తర్వాత రిటైల్ మార్కెట్‌లో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం Hyderabad లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 4,600 తగ్గి రూ. 1,41,550కు చేరింది. అంతకుముందు రెండు రోజుల్లో వరుసగా పెరిగిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గాయి. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 5,020 తగ్గి ప్రస్తుతం రూ. 1,54,420 వద్ద ఉంది.

బంగారం కంటే వెండి ధరలో పతనం మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర ఒక్కరోజులోనే రూ. 20 వేలు తగ్గి కేజీకి రూ. 3 లక్షలకు చేరింది. గత నాలుగు రోజుల్లోనే వెండి ధర మొత్తం రూ. 1.25 లక్షల మేర తగ్గడం గమనార్హం. ధరల ఈ భారీ మార్పులతో పెట్టుబడిదారులు, వినియోగదారులు మార్కెట్‌పై నిశితంగా దృష్టి పెడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.