Gold price 09/12/25 : బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పైకెక్కుతూనే ఉన్నాయి. దేశంలోని ప్రధాన 10 నగరాల్లో ఒక నగరంలో 18 క్యారెట్ స్వచ్ఛత గల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.లక్షను దాటి కొనుగోలుదారులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (FOMC) సమావేశం ముందస్తుగా జరగబోతున్న (Gold price 09/12/25) నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ ఊగిసలాట కనిపిస్తోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.10 పెరిగితే, 22 క్యారెట్ బంగారం కూడా రూ.10 పెరిగింది. మొత్తం రెండు రోజుల్లో 24 క్యారెట్ బంగారం రూ.280, 22 క్యారెట్ బంగారం రూ.250 వరకు పెరిగింది.
10 నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (Gold price 09/12/25)
| నగరం | 24 క్యారెట్ | 22 క్యారెట్ | 18 క్యారెట్ |
|---|---|---|---|
| ఢిల్లీ | రూ.1,30,580 | రూ.1,19,710 | రూ.97,980 |
| ముంబై | రూ.1,30,430 | రూ.1,19,560 | రూ.97,830 |
| కోల్‌కతా | రూ.1,30,430 | రూ.1,19,560 | రూ.97,830 |
| చెన్నై | రూ.1,31,340 | రూ.1,20,390 | రూ.1,00,390 |
| బెంగళూరు | రూ.1,30,430 | రూ.1,19,560 | రూ.97,830 |
| హైదరాబాద్ | రూ.1,30,430 | రూ.1,19,560 | రూ.97,830 |
| లక్నో | రూ.1,30,580 | రూ.1,19,710 | రూ.97,980 |
| పట్నా | రూ.1,30,480 | రూ.1,19,610 | రూ.97,880 |
| జైపూర్ | రూ.1,30,580 | రూ.1,19,710 | రూ.97,980 |
| అహ్మదాబాద్ | రూ.1,30,480 | రూ.1,19,610 | రూ.97,880 |
వెండి ధరలు
ఒక రోజు స్థిరత్వం తర్వాత వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రెండు రోజుల్లో మొత్తం రూ.1100 తగ్గి ప్రస్తుతం రూ.1,88,900 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతాలో ఇదే ధర ఉండగా, చెన్నైలో మాత్రం వెండి ధర కిలోకు రూ.1,97,900గా ఉంది.
Read Also: Johnny Master: డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య ఘన విజయం
ఈ వారం బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపే అంశాలు
- ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై సంకేతాలు
- చైనా, అమెరికా ఆర్థిక గణాంకాలు
- డాలర్‌తో రూపాయి మారకం విలువ
నిపుణుల మాట ప్రకారం, వడ్డీ తగ్గింపు అంచనాలు, (Gold price 09/12/25)సెంట్రల్ బ్యాంకుల డిమాండ్, అలాగే ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా బంగారం రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధరలు షార్ట్ టర్మ్‌లో కిలోకు రూ.2 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు వెళ్లే అవకాశముందని అంచనా.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: