Gold Price: ఈరోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధర..కొనుగోలు దారులకు భారీ ఊరట !!

Read Time:  1 min
Gold and Silver Rate Hyderabad March 16 2026
Gold and Silver Rate Hyderabad March 16 2026
FONT SIZE
GET APP

అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, విరుద్ధంగా బంగారం మరియు వెండి ధరలు భారీగా పతనమవ్వడం ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారింది. సాధారణంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు లేదా యుద్ధ సమయాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గు చూపుతారు, దీనివల్ల ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నా సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది. గత 20 రోజుల్లో కేవలం 3-4 రోజులు తప్ప, మిగిలిన రోజుల్లో ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. ఈరోజు (మార్చి 21) హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 1,200 తగ్గి రూ. 1,36,550 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ. 1,370 తగ్గి రూ. 1,48,910 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఒక్కరోజులోనే 200 డాలర్లకు పైగా పతనమై 4,492 డాలర్లకు పడిపోవడం ఈ భారీ తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Tamil Nadu Elections : తమిళనాడులో AIADMKదే పైచేయి?

బంగారం దారిలోనే వెండి ధరలు కూడా భారీగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు రూ. 5,000 తగ్గి రూ. 2.60 లక్షల వద్ద ఉంది. వారం వ్యవధిలోనే వెండి ఏకంగా రూ. 30,000 వరకు పతనమవ్వడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి రేటు కూడా దాదాపు 10 శాతం మేర కరెక్షన్‌కు గురై 67.97 డాలర్లకు చేరుకుంది. ఒకవైపు విలువైన లోహాల ధరలు తగ్గుతుంటే, మరోవైపు అంతర్జాతీయంగా డాలర్ బలం పుంజుకోవడంతో భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి (రూ. 93.57) పడిపోయింది. ఈ పరిణామాలు మార్కెట్‌లో తీవ్ర అస్థిరతను సూచిస్తున్నాయి, అయితే బంగారం కొనాలనుకునే వారికి మాత్రం ఇది ఒక మంచి అవకాశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.