Gold price 18/02/26 : మళ్లీ పడిపోయిన బంగారం ధర, హైదరాబాద్‌లో తాజా రేట్లు

Read Time:  1 min
Gold Rate 25/02/26
Gold Rate 25/02/26
FONT SIZE
GET APP

Gold price 18/02/26 : బంగారం కొనాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లోనూ ప్రభావం కనిపించింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,000 డాలర్ల సమీపం నుంచి సుమారు 4,880 డాలర్ల స్థాయికి పడిపోయింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గినా దేశీయంగా స్థిరంగా కొనసాగుతోంది.

Madanapalle Crime: బాలిక హత్య కేసు.. నిందితుడిని వదిలిపెట్టేది లేదు: సీఎం చంద్రబాబు

Gold price 18/02/26
Gold price 18/02/26

దేశీయ మార్కెట్లో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి సుమారు రూ. 2,050 తగ్గి రూ. 1,41,350 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,54,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కిలోకు సుమారు రూ. 2.65 లక్షల వద్ద స్థిరంగా ఉంది. డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్), అలాగే అమెరికా వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు వంటి అంశాలు బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.