ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న హిట్ సినిమాలు మరియు సిరీస్‌లు
ఈ వారం డిజిటల్ వేదికలో బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రేక్షకులకు అనేక ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. అయితే డాకు మహారాజ్ సినిమా నుండి క్రైమ్ బీట్ సిరీస్ వరకు ఈ వారం ఓటీటీలో విడుదల కానున్నవి ఏంటవి? ఎప్పుడు స్క్రీమింగ్ అవుతాయి? ఈరోజు మనం తెలుసుకుందాం
బేబీ జాన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
స్ట్రీమింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 19
క్యాస్ట్: వరుణ్ ధావన్, వామికా గబ్బి, కీర్తి సురేష్
ప్లాట్: ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడింది. ఇందులో హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో నటించిన ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, సన్యా మల్హోత్రా, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ ముద్ర వేసారు.

డాకు మహారాజ్(నెట్‌ఫ్లిక్స్)
స్ట్రీమింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 21
క్యాస్ట్: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా
ప్లాట్: ఈ చిత్రం యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది.
కౌశల్జీస్ వర్సెస్ కౌశల్ (జియో హాట్‌స్టార్)
స్ట్రీమింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 21
క్యాస్ట్: అశుతోష్ రానా, షీబా చద్దా, పావైల్ గులాటి
ప్లాట్: ఈ కామెడీ డ్రామా సినిమా సీమా దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కింది. జియో హాట్ స్టార్ వేదిక పై విడుదల అవుతుంది.
ఊప్స్! అబ్ క్యా? (జియో హాట్‌స్టార్)
స్ట్రీమింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 20
క్యాస్ట్: శ్వేతా బసు ప్రసాద్, ఆషిమ్ గులాటీ, అభయ్ మహాజన్
ప్లాట్: ఈ బాలీవుడ్ కామెడీ డ్రామా సిరీస్ జియో హాట్ స్టార్ వేదిక పై ప్రసారం అవుతుంది.
క్రైమ్ బీట్ ( ZEE5)
స్ట్రీమింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 21
క్యాస్ట్: సాకిబ్ సలీం, సబా ఆజాద్, రాహుల్ భట్
ప్లాట్: ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను చమటలు పెట్టించే విధంగా రూపొందించబడింది.
ఆఫీస్ ( జియో హాట్‌స్టార్)
స్ట్రీమింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 21
క్యాస్ట్: గురు లక్ష్మణ్ శబరీష్, స్మేహా, కీర్తివేల్
ప్లాట్: ఈ కామెడీ సిరీస్ సిరీస్ జియో హాట్ స్టార్‌లో సందడి చేయనుంది.
ఈ వారం ఓటీటీ లో ట్రెండింగ్ అవుతున్న సినిమాలు & సిరీస్‌లు
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, మరియు ZEE5 వంటి ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అనేక హిట్ సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ సినిమాలు యాక్షన్, కామెడీ, క్రైమ్ వంటి విభాగాలలో ఉండటంతో ప్రేక్షకుల మళ్లీ తప్పకుండా ఆకట్టుకుంటాయి.