Weather: తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వర్షాలు..

Weather: తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది తాత్కాలిక ఉపశమనాన్ని అందించనుంది.

Advertisements

వాతావరణ పరిస్థితులు

దక్షిణ ఛత్తీస్‌‌గడ్‌ నుండి విదర్భ, మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగుతోన్న ద్రోణి ప్రభావంతో మరత్వాడ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి విదర్భ, మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.దీని ప్రభావంతో ఇవాళ(మంగళవారం) తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుండి వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

తెలంగాణలో వర్షాలు

మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా,అదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే ఇవాళ(ఏప్రిల్ 1) గరిష్టంగా నిజామాబాద్ లో 41.2 కనిష్టంగా హనుమకొండ లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న(సోమవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, రామగుండం, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.

Meteorological Department cold news.. Rain forecast for Telangana

ఏపీలో వర్షాలు

మంగళవారం ఏపీలోని 26 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-6, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి కోరుకొండ మండలాల్లో వడగాలుల ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. రేపు(బుధవారం) 28 మండలాల్లో వడగాలులు వీచేందుకు ఛాన్స్ ఉంది.

అధిక ఉష్ణోగ్రతలు

ఎల్లుండి(గురువారం) రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. నిన్న(సోమవారం) నంద్యాల(D) గోస్పాడులో 40.3°C, కర్నూలు(D) కమ్మరచేడులో 40.2°C, అనంతపురం(D) నాగసముద్రంలో 40°C, వైఎస్సార్(D) గోటూరులో 39.9°C, అనకాపల్లి(D) రావికమతంలో 39.7°C, మన్యం(D) జియ్యమ్మవలసలో 39.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related Posts
Revanth Reddy : ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై రేవంత్ కీలక ఆదేశాలు

Revanth Reddy : ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై రేవంత్ కీలక ఆదేశాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై నెల రోజులుగా కొనసాగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ పూర్తి విజయాన్ని Read more

బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
bandi sithakka

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన "భారతదేశం టీం ఇండియా, కాంగ్రెస్ పాకిస్తాన్" అనే వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఆయన మాటలు Read more

జగన్ కర్నూలు పర్యటన
jagan wed

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యాహ్నం కర్నూలులో పర్యటించారు. కర్నూలులోని జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర Read more

పీఎం కిసాన్ నిధులు విడుదల
Release of PM Kisan funds

పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులు విడుదల అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×