తరచు తలనొప్పి రావడానికి గల కారణాలు..ఇవే

తరచు తలనొప్పి రావడానికి గల కారణాలు..ఇవే

ఈ మధ్య కాలంలో తరచూ తలనొప్పితో బాధపడేవారి సంఖ్య పెరిగిపోయింది. ధ్వనులు ఓవైపు, తీవ్ర ఒత్తిడి, మానసిక ఆందోళన వంటివి మరోవైపు తలనొప్పికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మన శరీరంలో ఏర్పడే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలనొప్పి రూపంలో బయటపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని జాగ్రత్తగా గమనించి, తగిన చర్యలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

రక్తపోటు (బ్లడ్ ప్రెషర్)
యుక్త వయసు దాటిన వారిలో తరచూ తలనొప్పి వస్తోందంటే… వారిలో రక్తపోటు స్థాయి సరిగా లేదని అర్థమని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ ప్రెషర్ తక్కువగాగానీ, ఎక్కువగా గానీ ఉండటం, ఉన్నట్టుండి పెరుగుతూ, తగ్గుతూ ఉండటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

తీవ్ర ఒత్తిడి (స్ట్రెస్)
ప్రస్తుతం ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి మధ్య జీవిస్తున్నారు. అయితే ఇలా ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగితే… వారు తరచూ తలనొప్పి బారిన పడతారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఆహారం జీర్ణ కాకపోవడం
సరిగా నిద్రలేకపోవడం, వేళకు తినకపోవడం, మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వంటివాటికితోడు పలు ఇతర సమస్యల కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు. ఇలాంటి వారిలో తలనొప్పి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు తీవ్ర స్థాయిలో తలనొప్పితో బాధపడే అవకాశం ఎక్కువని వివరిస్తున్నారు.

కంటి సమస్యలు
ఎవరిలోనైనా కంటి చూపు సమస్య మొదలైందంటే… అది తలనొప్పి రూపంలో మొదట బయటపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తరహా తలనొప్పి మరీ తీవ్రంగా ఉండదని… కానీ ఎక్కువ సేపు ఉండటం, తరచూ సమస్య తలెత్తడం జరుగుతుందని వివరిస్తున్నారు. తరచూ స్వల్పస్థాయి తలనొప్పి వేధిస్తుంటే కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

మైగ్రేన్
మెదడులోని రసాయనాల స్థితిలో తేడాలు రావడం వల్ల తీవ్ర స్థాయి తలనొప్పి వస్తుంది. దీనిని మైగ్రేన్ గా పిలుస్తారు. ఈ తరహా తలనొప్పిలో ఎక్కువ వెలుతురును, శబ్దాన్ని భరించలేకపోతారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ తలెత్తే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్
ఎవరైనా తరచూ, తీవ్ర స్థాయిలో తలనొప్పితో బాధపడుతూ కారణం ఏమిటో గుర్తించలేకపోతే… అది బ్రెయిన్ ట్యూమర్ సమస్య కావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మెదడులో కణతులు ఏర్పడితే… తలనొప్పి సమస్య తరచూ వేధిస్తుందని, తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మరెన్నో కారణాలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు
ఒక్కసారిగా మొదలయ్యే తలనొప్పి కొన్నిసార్లు గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందటి లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అరుదు అని పేర్కొంటున్నారు. మెదడులో ద్రవాలు పేరుకుపోవడం వంటివి కూడా తలనొప్పికి దారితీయవచ్చని చెబుతున్నారు. అందువల్ల తరచూ తలనొప్పి వేధిస్తుంటే… ముందుగా వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

headache warning signs thumb 1 732x549

Related Posts
రోజువారీ చక్కెర పరిమితి ఎంత ఉండాలో తెలుసుకోండి
రోజువారీ చక్కెర పరిమితి ఎంత ఉండాలో తెలుసుకోండి!

స్వీట్లు, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ లాంటి తీపి పదార్థాలు చాలా మందికి ఇష్టమే. కానీ, రోజూ ఎక్కువ మొత్తంలో చక్కెర తీసుకోవడం అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని Read more

ఆరోగ్య బీమా: 11% తిరస్కరణ పెరిగిన ప్రీమియం
ఆరోగ్య బీమా: 11% తిరస్కరణ పెరిగిన ప్రీమియం

ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో 11% తిరస్కరించబడ్డాయి, ప్రీమియంలు ఎక్కువ: IRDAI నివేదిక భారతదేశంలోని బీమా కంపెనీలు 2023-24లో 11% ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను తిరస్కరించాయి, భారత బీమా Read more

మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..
moringa powder

మునగాకు పొడి అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైన సహజ ఔషధంగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. మునగాకు, అంటే మునగా చెట్టు యొక్క ఆకులు, అనేక ఆరోగ్య లాభాలను కలిగి Read more

మితంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అవసరమా?
limit food

ఆహారాన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకమైన అంశం. బాగా పోషకాహారాలతో కూడిన ఆహారం తీసుకోవడం మరియు మితంగా ఆహారాన్ని ఆస్వాదించడం శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. Read more