These are the Oscar award winners

ఆస్కార్‌ అవార్డు విజేతలు వీరే..

లాస్‌ ఏంజిల్స్‌ : ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ‘ఎ రియల్‌ పెయిన్‌’ చిత్రంలో నటనకుగానూ కీరన్‌ కైల్‌ కల్కిన్‌ ఉత్తమ సహాయ నటుడిగా.. ‘ఎమిలియా పెరెజ్‌’లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘డ్యూన్‌: పార్ట్‌2’ ఉత్తమ సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇక లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్‌ సొంత చేసుకున్న ‘అనూజ’ చిత్రానికి నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో ‘ఐయామ్‌ నాట్‌ ఏ రోబో’ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది.

Advertisements
ఆస్కార్‌ అవార్డు విజేతలు వీరే..

నటీమణులు ఫ్యాషన్‌ ప్రపంచానికి సరికొత్త భాష్యం

లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్‌ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆస్కార్‌ అవార్డుల వేడుకకు వచ్చిన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ చిట్‌చాట్‌ చేశారు. ఈ వేడుకను ఏబీసీ, జియో హాట్‌స్టార్‌, స్టార్‌ మూవీస్‌, హులు, యూట్యూబ్‌ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్‌టీ టీవీలు ప్రత్యక్షప్రసారం చేస్తున్నాయి. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్‌, లిసా, క్వీన్‌ లతీఫా, రేయ్‌లు తమ ప్రదర్శనతో ఆహూతులను అలరించారు.

97వ ఆస్కార్‌ అవార్డులు..

.ఉత్తమ సహాయ నటుడు- కీరన్ కైల్‌ కల్కిన్ (ది రియల్ పెయిన్‌)
.ఉత్తమ సహాయ నటి- జోయ్ సాల్దానా (ఎమిలియా పెరెజ్‌)
.బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్‌ ఫిల్మ్‌- ఫ్లో
.బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌- ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌
.బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్- పాల్ తాజ్‌వెల్ (వికెడ్)
.బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్- ది సబ్‌స్టాన్స్
.బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే- సీన్ బేకర్ (అనోరా)
.ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే- కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)
.బెస్ట్ ఒరిజినల్ సాంగ్- ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
.ఉత్తమ ఎడిటింగ్- సీన్ బీకర్ (అనోరా)
.మేకప్, హెయిర్ స్టైలింగ్- ది సబ్ స్టాన్స్
.బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్- విక్డ్
.ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌- డూన్‌ 2
.బెస్ట్‌ సౌండ్‌- డూన్‌ 2
.బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌- నో అదర్‌ ల్యాండ్
.బెస్ట్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌- ఐయామ్‌ నాట్‌ ఏ రోబోట్‌
.బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌- ఎల్‌ మల్‌

Related Posts
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం
క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి జనవరి 2 న ప్రారంభించిన నిరాహార దీక్షలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో Read more

Revanth Reddy : మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా : రేవంత్ రెడ్డి
Revanth Reddy మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా రేవంత్ రెడ్డి

Revanth Reddy : మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా : రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై వస్తున్న విమర్శలకు తగినట్లుగా స్పందించారు. Read more

జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం
జామా మసీదు పై ఒవైసీ ఆగ్రహం

సంభాల్‌లో జామా మసీదు వద్ద నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌పై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. Read more

Trailer: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తెలుగు ట్రైలర్ విడుదల
Trailer: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తెలుగు ట్రైలర్ విడుదల

మాస్ మసాలా డోస్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తన ఫ్యాన్స్‌కు మరోసారి ఓ పవర్‌ఫుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ‘గుడ్ బ్యాడ్ Read more

×