ప్రొటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాంశం. ఇది కేవలం కండరాలను నిర్మించడమే కాకుండా, హార్మోన్‌ల ఉత్పత్తి, శక్తి లభ్యం వంటి అనేక కీలక పనులలో పాత్ర పోషిస్తుంది. అయితే, ఈ ప్రొటీన్‌ను అధికంగా తీసుకుంటే శరీరానికి మేలు కంటే మాలిన్యాలే ఎక్కువవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా అధిక మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం శరీరంలో దాహం పెరగడానికి కారణమవుతుంది. ఈ దాహాన్ని తృప్తి పరచేందుకు అధికంగా నీరు తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడుతుంది.
నోటి దుర్వాసన సమస్య
అలాగే, ప్రొటీన్ ఎక్కువగా తీసుకునే వారి శ్వాసనాళంలో ఆమ్లాల ప్రభావం వల్ల నోటి దుర్వాసన సమస్య తలెత్తుతుంది. దీనితో పాటు మలబద్ధకం కూడా సాధారణంగా కనిపించే సమస్య. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారు కొన్నిసార్లు పచ్చి కూరగాయలు, ఫైబర్ తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా మలవిసర్జన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వేడిని పెంచి, ఒళ్లు నొప్పులు, అలసట
ఇంకా, అధిక ప్రొటీన్ శరీరంలో వేడిని పెంచి, ఒళ్లు నొప్పులు, అలసట లాంటి ఇబ్బందులను కలిగించవచ్చు. శరీరబరువుకు అనుగుణంగా ప్రొటీన్‌ను సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్య నిపుణుల సూచనల ప్రకారం, ఒక్కొక్క కేజీ శరీర బరువుకు సగటున 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరమవుతుంది. అందువల్ల ప్రొటీన్ అవసరాన్ని గుర్తించుకుని, మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.