- 14న నోటిఫికేషన్ జారీ ఆగస్టు 4న సీట్ల కేటాయింపు
హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బిపిఈడి, డిపిఈడి
కాలేజీల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్(పిఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పిఈ సెట్ (TG PECT) -2025 కౌన్సెలింగ్ (Counseling) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 14న జారీ చేయనున్నారు. ఎడ్ సెట్, పిఈ సెట్ల అడ్మిషన్ల కమిటీ సమావేశం కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాల కిష్టా రెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ఎస్కీ మహమూద్, కార్య దర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి తోపాటు అడ్మిషన్ల కమిటీ సభ్యులు హాజరయ్యారు.

పిఇ సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు..
పిఇసెట్-2025 (TG PECT) కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెలలో జారీ చేయ నున్నారు. 14న నోటిఫికేషనను అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి 23 నుంచి 29 వరకు అవకాశం కల్పించారు. ఇదే సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషను నిర్వహించనున్నారు. స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ను (Certificate verification) ఈ నెల 25, 26 తేదిల్లో నిర్వహిస్తారు. కౌన్సెలింగ్కి అర్హుల వారి జాబితాను 30న ప్రకటిస్తారు. ఈ నెల 31, ఆగస్టు 1 తేదీల్లో వెన్ఆప్షన్లకు అవకాశం కల్పిం చారు. ఆగస్టు 2న వెబ్స్టేషన్లకు ఎడిట్ సౌకర్యం కల్పించారు. మొదటివిడత సీట్ల కేటాయింపు ఆగ స్టు 4న చేపట్టనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థు లు ట్యూషన్ ఫీజు చెల్లించి.. ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఆగస్టు 5 నుంచి 8 వరకు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. 11 నుంచి క్లాసులను ప్రారంభిం చనున్నట్టు అధికారులు తెలిపారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Nagar Kurnool: కార్పొరేట్ కు ధీటుగా సర్కారు దవాఖానాలు