టెస్లా మాస్ ఎంట్రీ.. ముంబైలో భారీ షోరూమ్!

టెస్లా మాస్ ఎంట్రీ.. ముంబైలో భారీ షోరూమ్!

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు రెడీ అవుతుంది. అయితే మొదటి దశలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఒక గ్రాండ్ షోరూమ్ ఓపెన్ చేయనుంది. ఈ ప్రాంతం వాణిజ్య స్థలాలకు ముఖ్య ప్రదేశం. అలాగే, ఇక్కడ స్థలాల అద్దె(rent) కూడా భారీగానే ఉంటుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఒక కమర్షియల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా లీజుకు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక్కడే టెస్లా కార్ మోడళ్లను ప్రదర్శించబోతోంది. దీనికి ప్రతినెల అద్దె చదరపు అడుగుకు దాదాపు రూ.900. అంటే నెలకు దాదాపు రూ.35 లక్షలు. ఈ డీల్ 5 సంవత్సరాలు. ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో టెస్లా రెండవ షోరూమ్‌ను కూడా ప్రారంభించాలని చూస్తుంది.

Advertisements

నరేంద్ర మోడీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో భేటీ

అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం జరిగిన కొన్ని వారాల తర్వాత ఈ కొత్త డీల్ ఖరారైంది. అంతేకాదు టెస్లాలో పనిచేయడానికి జాబ్ అఫర్ లిస్ట్ కూడా విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మార్పులు చేస్తున్నారు. ఇటీవల ఆయన పరస్పర పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు.ఇది భారతదేశం- అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి వివిధ గందరగోళాలకు దారితీసింది. పరస్పర పన్ను విధానం అనేది అమెరికాతో వ్యాపారం చేసే ఏ దేశాలకు వర్తించే పన్నుల వ్యవస్థ. అమెరికా కూడా ఆ దేశాలు విధించే పన్నులకు అనుగుణంగా పన్నుల ప్రక్రియ చేపడుతుంది.

టెస్లా మాస్ ఎంట్రీ.. ముంబైలో భారీ షోరూమ్!

దీనివల్ల టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం గురించి కొంత గందరగోళం ఏర్పడింది. ఈ ధోరణిని అనుసరించి, భారతదేశంలో షోరూమ్‌ను ప్రారంభించడానికి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. టెస్లా చాలా సంవత్సరాలుగా భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈ కంపెనీ మొదట 2022లో భారతదేశంలోకి ప్రవేశించాలని ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. భారత ప్రభుత్వం దిగుమతి చేసుకున్న వాహనాలపై 110 శాతం వరకు పన్నులు విధిస్తుంది. ఇది ఆందోళన కలిగించే విషయమని, అధిక పన్నుల కారణంగా టెస్లా భారతదేశంలో కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవలసి వస్తోందని ఆయన అన్నారు.

భారతదేశంలో అధిక పన్నులతో కష్టం!
ఒక ఇంటర్వ్యూలో టెస్లా సీఈఓ మాట్లాడుతూ భారతదేశంలో అధిక పన్నులు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పన్నుల ద్వారా వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాయని, భారతదేశంలో అధిక పన్నుల కారణంగా టెస్లా కార్లను అమ్మడం అసాధ్యమని అన్నారు. భారతదేశంలో టెస్లా వాహనాలు రూ. 21 లక్షల నుండి అమ్ముడవుతాయని అంచనా. అయితే దేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ప్రీమియం ధర అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్ ధర రూ. 50.70 లక్షలు, టెస్లా మోడల్ 2 ధర రూ. 45 లక్షలు, టెస్లా మోడల్ 3 ధర రూ. 60 లక్షలు, టెస్లా మోడల్ Y ధర రూ. 70 లక్షలు, టెస్లా మోడల్ S ధర రూ.1.50 కోట్లు టెస్లా మోడల్ X ధర రూ.2 కోట్లు. భారతదేశంలో కారు కొనాలని ప్లాన్ చేసుకునే వారికి భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది.

Related Posts
2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు : ఐరాస
India population will be 170 crores by 2061 .

చైనా జనాభా 2021 నుంచి క్రమంగా తగ్గుముఖం న్యూయార్క్‌: ప్రపంచ జనాభా ధోరణులపై ఐక్యరాజ్య సమితి అంచనాలు విడుదల చేసింది. 2061 నాటికి భారత్‌ జనాభా 170 Read more

ప్రపంచంలోని అత్యంత పొడవైన మరియు  అత్యంత పొట్టిగా ఉన్న మహిళలు లండన్‌లో కలిశారు..
smallest tallest

2024 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ డే సందర్భంగా, ప్రపంచంలో అత్యంత పొడవైన మహిళ రుమేసా గెల్గీ (7 అడుగులు 1.6 అంగుళాలు) మరియు అత్యంత చిన్న మహిళ Read more

క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!
క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!

కేవలం 95 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధాన, వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన భారత మహిళగా నిలిచింది. మిథాలీ రాజ్ Read more

indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారతీయులు చిక్కులోఅంతర్జాతీయ మాదకద్రవ్య రవాణా కేసులో ముగ్గురు తమిళనాడుకు చెందిన భారతీయులు ఇండోనేషియాలో అరెస్టు అయ్యారు. 106 కిలోల డ్రగ్స్ తరలిస్తుండగా Read more

×