Tension in Serbian parliament.. MPs injured

సెర్బియా పార్లమెంట్‌లో ఉద్రిక్తత .. ఎంపిలకు గాయాలు

బెల్గ్రేడ్: సభలో పొగ బాంబులు విసరడంతో మంగళవారం సెర్బియా పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ముగ్గురు పార్లమెంట్‌ సభ్యులు గాయపడగా, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విశ్వ విద్యాలయ విద్యకు నిధుల పెంపునకు ఉద్దేశించిన చట్టంపై ఓటింగ్‌ జరగాల్సి వుంది. ఈ సమావేశమే చట్ట విరుద్ధమైనదని వాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ముందుగా ప్రధాని మిలోస్‌ వుసెవిక్‌ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. సమావేశం ప్రారంభమైన గంట తర్వాత పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. సెర్బియా ఎదుగుతోంది. పాలన క్షీణిస్తోంది అని రాసి వున్న బ్యానర్‌ను చేబూని, ఈలలు ఊదుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు.

సెర్బియా పార్లమెంట్‌లో ఉద్రిక్తత ఎంపిలకు

పొగబాంబులు విసరడంతో ముగ్గురు ఎంపిలకు గాయాలు

దీంతో ఎంపీల మధ్య తొలుత ఘర్షణ మొదలైంది. ఆ వెంటనే పొగ బాంబులు విసురుకున్నారని బయటకు వచ్చిన వీడియోలను బట్టి తెలుస్తోంది. గుడ్లు, నీళ్ళ సీసాలను కూడా ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రతిపక్షం తీవ్రవాదుల్లా వ్యవహరిస్తోందని పార్లమెంట్‌ స్పీకర్‌ అనా బ్రనబిక్‌ విమర్శించారు. ఈ సంఘటనతో దేశంలో రాజకీయ సంక్షోభం ఎంతలా నెలకొందో స్పష్టమవుతోంది. నెలల తరబడి కొనసాగుతున్న అవినీతి వ్యతిరేక నిరసనలతో ప్రభుత్వం అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రధాని వుసెవిక్‌ తన పదవికి జనవరిలో రాజీనామా చేశారు. పార్లమెంట్‌ ఇంకా దాన్ని ఆమోదించాల్సి వుంది.

విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం

కాగా, సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో గత నవంబర్‌లో ఓ రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మృతి చెందారు. అప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థుల ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు సహా అనేక రంగాలకు చెందిన వారు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఉద్యమ తీవ్రతకు తలొగ్గిన ప్రధాన మంత్రి మిలోస్ పుచెవిచ్ ఇటీవల రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి రాజీనామాను 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదా మధ్యంతర ఎన్నికలు జరిపించడమా అనేది తేల్చాల్సి ఉంది. అయితే పార్లమెంటులో ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోపక్క పార్లమెంటులో యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

Related Posts
యల్‌జి “గణతంత్ర దినోత్సవ” ఆఫర్లు
LG launches 'The Nation Calls for Celebration' campaign with special Republic Day offers

న్యూ ఢిల్లీ : LG ఎలక్ట్రానిక్స్ ఇండియా గణతంత్ర దినోత్సవ స్పూర్తిని జరుపుకునేందుకు ప్రత్యేక ప్రచారం, ‘ద నేషన్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్’ ను ప్రారంభించింది. ఈ Read more

మతపరమైన పోస్టు: కాంగ్రెస్ ఎంపీపై కేసు
మతపరమైన పోస్టు కాంగ్రెస్ ఎంపీపై కేసు

గుజరాత్‌లోని జామ్నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీపై, రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ Read more

అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు
US deporting millions of il

అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కో వలసదారుని పంపించేందుకు సుమారు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) Read more

America: జర్నలిస్టు కంటపడిన యెమెన్‌పై దాడుల సంభాషణ
జర్నలిస్టు కంటపడిన యెమెన్‌పై దాడుల సంభాషణ

యెమెన్ మీద అమెరికా దాడి చేసే విషయమై జాతీయ భద్రతాధికారుల మధ్య 'సిగ్నల్' యాప్‌లో జరిగిన రహస్య సంభాషణను ప్రముఖ పొలిటికల్ జర్నలిస్టు జెఫ్రీ గోల్డ్‌బర్గ్ చూశారు. Read more