రాష్ట్రంలో తొలి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు

Read Time:  1 min
The first case of Guillain Barre syndrome has been registered in the state
The first case of Guillain Barre syndrome has been registered in the state
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్‌ బారే సిండ్రోల్‌ హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణెలో 130కిపైగా జీబీఎస్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తొలి బీజీఎస్‌ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్‌ బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇదని తెలిపారు.

image

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వెల్లడించారు. అయితే ఈ వైరస్‌ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, జీబీఎస్‌ అంటు వ్యాధి కాదని, చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చన్నారు.

కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే వందకుపైగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది సోకిన వారిలో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత నరాల వ్యవస్థపైనే దాడిచేస్తుంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.