కోర్టులో కేటీఆర్ కు వరుస నిరాశలు

Read Time:  1 min
ktr
ktr
FONT SIZE
GET APP

ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరాశ తప్పలేదు. కేసు విచారణకు తనతో పాటు తన లాయర్ ను కూడా అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేటీఆర్ విన్నపాన్ని తిరస్కరించింది.
విచారణను లాయర్ చూసే నిబంధన ఏసీబీలో ఉందా? అని ప్రశ్నించింది. సాయంత్రం 4 గంటల్లోగా దీనికి సమాధానం చెపుతామని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో, తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.
విచారణ గదిలో కేటీఆర్ తో కలిసి ఆయన లాయర్ కూర్చోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ గదిలోకి లాయర్ ను అనుమతించబోమని తెలిపింది. కేటీఆర్ కనిపించే విధంగా కాస్త దూరంలో లాయర్ ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదిని అడిగింది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.