హైదరాబాద్‌లోని యూసఫ్ గూడా డంపింగ్ యార్డ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. ఉదయం చెత్త తొలగించే క్రమంలో లారీ డోర్ విఫలమైంది. ఇంతలో అతడి కాలు జారి చెత్తను తొలగించే మిషన్ అతడిని తనలోపలికి లాగేసుకుంది. తోటి కార్మికులు ఇది గ్రహించి బయటకు తీసేలోపు అతడు చనిపోయాడు. మృతుడిది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా దుగ్గలి మండలం పగిడిరాయి వాసిగా గుర్తించారు.
Read Also: Telangana: మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!
స్వచ్ఛ కార్మికులు ఆందోళనకు దిగారు
అయితే రాంకీ సంస్థ నిర్లక్ష్యం వల్లే కార్మికుడు చనిపోయారని యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ స్వచ్ఛ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం న్యాయం చేసే వరుక ఆందోళన విరమించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఈ కార్మికుడి మరణానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: