Youtuber Vaishnavi Death Case Updates: జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి మృతి కేసులో పోలీసులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. అదనపు కట్నం కోసమే ఆమె భర్త హరిబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ రాములు ధృవీకరించారు. దాదాపు పది నెలల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, పెళ్లిలో కట్నం రాలేదన్న నెపంతో హరిబాబు కుటుంబ సభ్యులు వైష్ణవిని నిరంతరం వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలింది.
Read Also:YouTuber Vaishnavi Murder updates: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్

కట్నం కోసమే భర్త కిరాతకం!
వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే తమ శక్తి మేరకు రూ. 5 లక్షల నగదుతో పాటు రెండు గుంటల భూమిని కట్నంగా ఇచ్చినప్పటికీ, హరిబాబు ఆశ చావలేదు. ఈ క్రమంలోనే భర్తను అతని తల్లి మరియు అన్నదమ్ములు రెచ్చగొట్టడంతో, వైష్ణవిని హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరిబాబును పోలీసులు నిన్ననే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితుడిని ప్రోత్సహించిన మిగిలిన కుటుంబ సభ్యుల పాత్రపై కూడా లోతైన దర్యాప్తు జరుగుతోందని డీఎస్పీ వివరించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కట్నం కోసం పొట్టనబెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు.
Youtuber Vaishnavi Death Case Updates: ప్రేమ వివాహం.. రెండేళ్ల కాపురం
మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి, కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబుతో యూట్యూబ్ వేదికగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది. అయితే, హరిబాబు తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించలేదు. వారిని ఎదిరించి వైష్ణవిని పెళ్లి చేసుకున్న హరిబాబు, అత్తగారి ఇంట్లోనే ఉంటూ రెండేళ్లుగా సంసారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వైష్ణవి ఇప్పుడు ఐదు నెలల గర్భవతి.
ఆస్తి తగాదాలు.. అర్థరాత్రి ఘర్షణ
కొంతకాలంగా హరిబాబు సొంత ఇంట్లో ఆస్తి తగాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం కాస్తా పెను గొడవకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన హరిబాబు, ఇంట్లోని కత్తిని తీసుకుని వైష్ణవిని విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది
హరిబాబు వివాహేతర సంబంధం కోణంలో వీడియోలు
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. భర్త హరిబాబుకు మరొకరితో సంబంధం ఉన్నట్లు చూపిస్తూ కొన్ని వీడియోలను ఈ దంపతులు చిత్రీకరించినట్లు తెలిసింది. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి వీడియోలు చేశారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉన్న ఇటువంటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టవద్దని హరిబాబు పలుమార్లు వైష్ణవిని హెచ్చరించినట్లు సమాచారం.
Youtuber Vaishnavi Death Case Updates: వివాదానికి దారితీసిన హెచ్చరికలు
వీడియోల చిత్రీకరణ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయని, హరిబాబు హెచ్చరికలను వైష్ణవి ఖాతరు చేయకపోవడమే ఈ ఘాతుకానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్ వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయడంతో మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరాయని తెలుస్తోంది. మరోవైపు, వైష్ణవి మరియు హరిబాబు మధ్య ఇన్ని గొడవలు ఉన్న విషయం తమకు తెలియదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: