అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఘనంగా యోగా డే వేడుకలు జరగనున్నాయి. ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు యోగా ప్రాధాన్యతను తెలియజేసే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ప్రముఖుల సమక్షంలో వైభవంగా కార్యక్రమం
ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొననున్నారు. మొత్తం 5,500 మంది ఈ కార్యక్రమంలో యోగా ఆసనాలు వేయనున్నారు. యోగా శిక్షకుల పర్యవేక్షణలో నిపుణుల సహాయంతో ఈ కార్యక్రమం జరుగనుంది.
ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్న ఈ వేడుకలో ఆయన సందేశాన్ని స్టేడియంలో పెద్ద స్క్రీన్‌లపై ప్రదర్శించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా జరగుతున్న యోగా డే వేడుకల్లో గచ్చిబౌలి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం యోగా అనుసరించాలంటూ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు ప్రజలకు సందేశాలు ఇవ్వనున్నారు.
Read Also : Modi : విశాఖ కు చేరుకున్న ప్రధాని మోదీ