📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Yadadri Bhuvanagiri: పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిట

Author Icon By Saritha
Updated: January 2, 2026 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాదాద్రి భువనగిరి : (Yadadri Bhuvanagiri) కొత్త సంవత్సరాన్ని ఆధ్యాత్మికతతో స్వాగతించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలి వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్త ఏడాది తొలి రోజున స్వామివారి దర్శనం చేసుకుని శుభారంభం కావాలనే ఆకాంక్షతో భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాల బాట పట్టారు. ఆలయ ప్రాంగణాలు భక్తిశ్రద్ధలు, జయజయధ్వానాలతో సందడిగా మారాయి. ప్రత్యేకించి శ్రీ యాదగిరిగుట్ట శ్రీ నరసింహస్వామి దేవాలయం, ఈ సంవత్సరంలో అంబరాన్నంటిన సంబురాలు మంత్రి పొన్నం(Minister Ponnam) యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు, స్వర్ణగిరిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంల్లో తెల్లవారు జామున నుంచే భక్తుల రద్దీ కనిపించింది. స్వామివారి దర్శనం భక్తులు ఓర్పుతో నిలబడి పూజలు నిర్వహించారు.

Read also: MP Raghunandan: బిజెపి అధికారంలోకి వస్తుందని బాండ్ రాసిస్తా

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు

ఈ సందర్భంగా ఆలయాల్లో అలంకరణలు, అభిషేకాలు, హోమాలు, విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. (Yadadri Bhuvanagiri) కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా మలచుకోవాలనే ఉద్దేశంతో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు కూడా ఆలయాలను దర్శించారు. ఈ క్రమంలో యాదగిరిగుట్టలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, శ్రేయస్సు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ తో పాటు ఇతర ప్రముఖులు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్ల సక్రమ నిర్వహణ, ప్రసాద పంపిణీ, తాగునీరు, వైద్య సౌకర్యాలు, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేశారు. పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు .మొత్తంగా కొత్త ఏడాది వేడుకలు భక్తి, ఉత్సాహం, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగాయి. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాలు భక్తుల జయ జయధ్వానాలతో మార్మోగాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


Devotees Gathering Latest News in Telugu minister ponnam New Year Celebrations Swarnagiri Temple Telugu News Yadadri Bhuvanagiri Yadagirigutta Temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.