Yadadri Bhuvanagiri Crime: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో పరువు హత్యాయత్నం కలకలం సృష్టించింది. కేవలం మూడు రోజుల క్రితమే ప్రేమవివాహం చేసుకున్న అజయ్ అనే యువకుడిని చంపేందుకు యువతి బంధువులు దారుణానికి ఒడిగట్టారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో అజయ్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
Read Also: Telangana Bills Released: తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల
కళ్లలో కారం చల్లి.. 14 సార్లు కత్తితో పొడిచి..
బాధిత యువకుడు అజయ్, తన ప్రేయసిని మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, సమస్యను పరిష్కరించుకుందాం, మాట్లాడదాం అని పిలిచిన యువతి సోదరుడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అజయ్ అక్కడికి చేరుకోగానే, పథకం ప్రకారం అతని కళ్లలో కారం చల్లి పారిపోకుండా అడ్డుకున్నారు.
అనంతరం కత్తితో అజయ్‌పై దాడి చేస్తూ ఏకంగా 14 సార్లు శరీరంపై పొడిచినట్లు సమాచారం.ఈ ఘటనలో అజయ్ తీవ్రంగా గాయపడటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: