Yadadri Bhuvanagiri Crime: ప్రేమ పెళ్లిపై కక్షతో యువకుడిపై దాడి

Read Time:  1 min
Odisha crime news
Odisha crime news
FONT SIZE
GET APP

Yadadri Bhuvanagiri Crime: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో పరువు హత్యాయత్నం కలకలం సృష్టించింది. కేవలం మూడు రోజుల క్రితమే ప్రేమవివాహం చేసుకున్న అజయ్ అనే యువకుడిని చంపేందుకు యువతి బంధువులు దారుణానికి ఒడిగట్టారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో అజయ్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.

Read Also: Telangana Bills Released: తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల

కళ్లలో కారం చల్లి.. 14 సార్లు కత్తితో పొడిచి..

బాధిత యువకుడు అజయ్, తన ప్రేయసిని మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, సమస్యను పరిష్కరించుకుందాం, మాట్లాడదాం అని పిలిచిన యువతి సోదరుడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అజయ్ అక్కడికి చేరుకోగానే, పథకం ప్రకారం అతని కళ్లలో కారం చల్లి పారిపోకుండా అడ్డుకున్నారు.

Yadadri Bhuvanagiri Crime: Attack on a young man due to a dispute over a love marriage
Yadadri Bhuvanagiri Crime: Attack on a young man due to a dispute over a love marriage

అనంతరం కత్తితో అజయ్‌పై దాడి చేస్తూ ఏకంగా 14 సార్లు శరీరంపై పొడిచినట్లు సమాచారం.ఈ ఘటనలో అజయ్ తీవ్రంగా గాయపడటంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.