📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Yadadri Bhuvanagiri: ధరణి కుంభకోణం సూత్రధారి బస్వరాజు!

Author Icon By Saritha
Updated: January 17, 2026 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాదాద్రి భువనగిరి : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ వ్యవస్థలోనే లొసుగులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన కుంభకోణం గుట్టు ఎట్టకేలకు రట్టయింది. జనగామ, యాదాద్రి జిల్లాలను(Yadadri Bhuvanagiri) కుదిపేసిన రూ.3.90 కోట్ల కుంభకోణంలో అసలు సూత్రధారి పసునూరి బసవరాజుగా పోలీసులు నిర్ధారించారు. మొత్తం ముఠాలోని 15 మంది నిందితులను అరెస్టు చేయగా, మరో 9 మంది పరారీలో ఉన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలుదర్యాప్తులోకి దిగాయి.

Read also: TG: దావోస్ లో తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

నిందితుల నుంచి పోలీసులు భారీగా స్వాధీనం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్ల సృష్టికర్తలను ఆదుపులోకి తీసుకొని పోలీసులు కూపీలాగడంతో అసలు బండారం బట్టబయలు అయింది. నిందితుల నుంచి రూ.63.19 లక్షల నగదు, సుమారు రూ.1 కోటి విలువైనవి ఆస్తి పత్రాలు, 1 కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Yadadri Bhuvanagiri) ఈ పరికరాల్లో ధరణి లాగిన్ వివరాలు, మార్పు చేసిన చలాన్లు, మధ్యవర్తుల జాబితాలు ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విలేకరుల ముందు పూర్తి వివరాలను వెల్లడించారు.

కుంభకోణం ఎలా జరిగింది?..

(పోలీసుల దర్యాప్తు ప్రకారం)… యాదగిరిగుట్టలో ఆన్లైన్ సేవా కేంద్రం నడిపే పసునూరి బసవరాజు, జెల్లా పాండు ఈ నెట్వర్కు కేంద్రంగా వ్యవహరించారు. మరో కీలక నిందితుడు గణేష్ కుమార్ రైతులను సంప్రదించి, ఎన్ఆర్ఎ ఖాతా ద్వారా చెల్లిస్తాం, పని త్వరగా పూర్తవుతుందని చెప్పి పూర్తి మొత్తాన్ని మీ-సేవ కేంద్రాల ద్వారా నగదుగా వసూలు చేసేవాడు. తర్వాత ఆ చలాన్లను బసవరాజు ధరణి/భూభారతి పోర్టల్ లోని ఎడిట్ అప్లికేషన్ ఫీచర్తో మార్చి ఫీజు మొత్తాన్ని తగ్గించి మొబైల్ ద్వారా రైతులకు తిరిగి పంపేవాడు. ఆ మార్పు చేసిన (నకిలీ) చలాన్లను స్థానిక ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తుల ద్వారా సమర్పించి, ప్రభుత్వానికి తక్కువ మొత్తం చెల్లించి మిగతా సొమ్మును ముఠా పంచుకున్నట్లు గుర్తించారు.

కమీషన్ల వ్యవస్థనే అక్రమాలకు బీజం

పోలీసుల విచారణలో కీలక అంశాలు బయటపడినాయి. మీ- సేవ(MeeSeva) నిర్వాహకులు, ఆన్లైన్ ఏజెంట్లు, మధ్యవర్తులకు 10 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్ బోగస్ డాక్యుమెట్ల సృష్టికర్త బస్వరాజు చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి కొట్టారు. ధరణి పత్రాలను బయట కేంద్రాల్లో కాకుండా ప్రధాన నిందితులే తమ వద్దే నమోదు చేయడం ద్వారా పూర్తి నియంత్రణ తమ చేతుల్లో ఉంచుకున్నారు. ఈ ముఠా రెండు జిల్లాల్లో 1,080 భూమి రిజిస్ట్రేషన్ పత్రాల్లో అవకతవకలకు పాల్పడింది. మొత్తం 22 కేసులు నమోదు కాగా: జనగామ జిల్లాలో7 కేసులు, యాదాద్రి జిల్లాలో 15 కేసులు తాసిల్దార్ల ఫిర్యాదుల మేరకు నమోదు అయ్యాయి. కేసు విచారణ దర్యాప్తు మరింత ముందుకెళ్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

15 మంది అరెస్టు, మరో 9 మంది పరార్

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన 15 మంది అరెస్ట్… అరెస్టు అయిన వారిలో.. పసునూరి బసవరాజు (32) యాదాద్రి, జెల్లా పాండు (46) యాదాద్రి, మహేశ్వరం గణేష్ కుమార్ (39) యాదాద్రి, ఈగజులపాటి శ్రీనాథ్ (35) జనగామ, యెనగంధుల వెంకటేష్ జనగామ, కోదురి శ్రావణ్ (35) జనగామ, కొలిపాక సతీష్ కుమార్ (36) కొడకండ్ల, తడూరి రంజిత్ కుమార్ (39) నర్మెట్ట, దుంపల కిషన్ రెడ్డి (29) ఆత్మకూర్ (ఎం) యాదాద్రి జిల్లా, దశరథ మేఘావత్ (28) తురుపల్లి యాదాద్రి జిల్లా, నారా భాను ప్రసాద్ (30) యాదగిరిగుట్ట, గొపగాను శ్రీనాథ్ (32) అమం గళ్, ఒగ్గు కర్ణాకర్ (42) యాదాద్రి, శివకుమార్ (33) అమంగళ్, అలేటి నాగరాజు (32) యాదాద్రి ఉన్నారు. పరారీలో ఉన్న 9 మంది కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ జారీ చేయడంతో పాటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులే ఆయుధంగా మలుచుకొని నిందితులు ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ధరణిలో ఎడిట్ ఆప్షన్కు సరైన ఆడిట్ ట్రయిల్ లేకపోవడం మీ-సేవ కేంద్రాలపై కఠిన పర్యవేక్షణ లేకపోవడంమే.

ఎసిబి, సైబర్ దర్యాప్తు ముమ్మరం

ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందా? సర్వర్ లాగ్స్, డిజిటల్ ఫుట్రప్రింట్స్ విశ్లేషణ, బ్యాంకు లావాదేవీల ట్రాకింగ్, మరిన్ని ఆస్తుల గుర్తింపు కోసం ఏసీబీ బృందాలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలు వేరువేరుగా ఈ కేసును మరింత వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది .ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి తదితర సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


ACB investigation Basavaraju Dharani Scam Fake Documents Jangaon Land Registration Fraud Latest News in Telugu Telangana Telugu News Yadadri Bhuvanagiri

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.