📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Writer Vijayendra Prasad: సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Author Icon By Anusha
Updated: February 18, 2026 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Writer Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 17) రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని భావోద్వేగంగా ప్రసంగించారు.

Read Also: Bomb Threat: కరీంనగర్‌, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపులు

తమ పూర్వీకులు సంపన్న కుటుంబానికి చెందిన వారని.. వారు అంటరానితనం పేరుతో నోటితో చెప్పటానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారన్నారు. అయితే తనకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయాలేదని వ్యాఖ్యనించారు. అప్పటి పరిస్థితులను తలుచుకుంటే మనసు సిగ్గుతో చచ్చిపోతుందని.. అవమానంతో కుంగిపోతుందని.. అందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తమ పూర్వీకులు చేసిన తప్పుకు క్షమించాలని వేడుకున్నారు.

Writer Vijayendra Prasad: Interesting comments by film writer Vijayendra Prasad

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై ఒక సినిమా కథ రాస్తున్నా

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం తన కార్యాలయంలో మహనీయుడు అంబేడ్కర్‌ చిత్రం మాత్రమే ఉంటుందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై ఒక సినిమా కథ రాస్తున్నానని.. ప్రస్తుతం దానిపై పరిశోధన చేస్తున్నాట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ పాట పాడి సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలామా.. పోరు తెలంగాణమా’ అంటూ ఆయన ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ పాటను పాడారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

hyderabad latest news RavindraBharathi Telugu News Writer Vijayendra Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.