📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

World Tiger Day: పులితోనే జీవవైవిధ్యం

Author Icon By Anusha
Updated: July 30, 2025 • 2:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ పులుల దినోత్సవంలో నేషనల్ కన్సర్వేషన్ అథారిటీ మాజీ సభ్యుడు అనూప్ కుమార్ నాయక్

హైదరాబాద్ : వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న జీవ పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనం దరిపై ఉందని ఎన్ సిఏ (నేషనల్ కన్సర్వేషన్ అథారిటీ) మాజీ సభ్యుడు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి అనూప్ కుమార్ నాయక్ (Anup Kumar Nayak) అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా దూల పల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడెమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణవ్యవస్థలలో పులులు పోషించే కీలక పాత్రను గుర్తిం చాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపులి అంటే శక్తి, అందం వంటి చిహ్నాలు మాత్రమే కాదు, అవి ప్రకృతి సమతుల్య తను కాపాడుకోవడానికి సహాయపడే కీస్టోన్ జాతులని మనమందరం గ్రహించాలన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులిమీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉండటంతో పులుల మనుగడ అనేది మానవాళి మనుగడకు ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు.

పెద్దపులుల సంరక్షణకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

అటవీదళాల ప్రధాన సంరక్షిణాధికారిణి డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ.. పెద్దపులుల సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని (World Tiger Day) నిర్వహించుకుంటున్నామన్నారు. పులుల ఆవాసాల సంరక్షణ, విస్తరణకు ప్రజల మద్దతు అవసరమని, పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. పెద్దపులుల సంరక్షణకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లను చాలా బాగా నిర్వహించడంతో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ప్రత్యేకించి అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వాటి సంఖ్య 36కు చేరుకుందని తెలిపారు. తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగినసంఖ్యలో జంతు వులు, నీటివనరులు వంటివి ఉండడంతో పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల్లో పులుల ఇక్కడకు తరలివస్తున్నా యన్నారు.

World Tiger Day: పులితోనే జీవవైవిధ్యం

చిత్రలేఖనా పోటీలు నిర్వహించి వాటిలో

గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య పెరగడం ఇందుకు కలిసివస్తుందన్నారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈలు సింగ్మీరు మాట్లా డుతూ వన్యప్రాణులు మానవుల మధ్య సంఘర నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకు టున్నామని, పులులకు భద్రత, వాటి సహ ఆవాసాల సమీప ప్రాంతాలలో నివసించే ప్రఙ శ్రేయసుకు ప్రాధాన్యమిచ్చే విధంగా టైగ ప్రాజెక్ట్ను పునరావిష్కరించుకునే దిశగా అడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. కవ్వాల్ టైగర్ ప్రాజె డైరెక్టర్ శాంతారాం. నాగర్ కర్నూల్ దీనీవీ రోహి కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సంబందించిన అన్ని వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారుఈ సందర్భం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనా పోటీలు నిర్వహించి వాటిలో ప్రతిభ కనబరిచి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమలో వైల్డఫ్కు విశేషసేవలు అందించా అటవీ అధికారిశంకరన్ను అధికారులు ఘనం సత్కరించారు. ఈ కార్యక్రమలో పిసిసిఎఫ్( వింగ్) జవహరి, టిజిఎఫ్ సి చైర్మన్ చైర్మ సునీత ఎర్ భాగవత్ తెలంగాణ ఫారెస్ట్ అకాడ డైరెక్టర్ ఎస్బీ ఆశ ఇతర ఉన్నతాధి కారు పాల్గొన్నారు.

పులులు ఎందుకు ప్రసిద్ధి చెందాయి?

పులులు ప్రకృతికి శక్తివంతమైన ప్రతీకగా,ధైర్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు పులులు సాంస్కృతికంగా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగినవి. అడవి పర్యావరణాన్ని సమతుల్యం చేయడంలో పులులు కీలకపాత్ర పోషిస్తాయి.

పులులు ఎందుకు అంత ముఖ్యమైనవి?

పులులు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలకపాత్ర పోషించే అగ్ర శ్రేణి మాంసాహార జంతువులు.పులులను రక్షించడం ద్వారా ఇతర జంతువులు, వృక్షజాలం, స్వచ్ఛమైన నీటి వనరులు, కార్బన్ శోషణ వంటి పర్యావరణ సేవలు కూడా లభిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:  Student: ఈ పురుగుల అన్నం మాకొద్దు..

Anup Kumar Nayak Speech Breaking News Hyderabad Tiger Conservation Awareness latest news National Conservation Authority India Telugu News World Tiger Day Event Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.