📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Osmania Hospital: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుప‌త్రి పనులు

Author Icon By Anusha
Updated: October 3, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన ఉస్మానియా ఆసుపత్రి, నిజాం కాలం నాటి చారిత్రాత్మక వైద్యశాలగా ప్రసిద్ధి పొందింది. దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ కోట్లాది మందికి జీవనాధారం.

అయిన ఈ ఆస్పత్రి ఇప్పుడు కొత్త రూపులోకి అడుగుపెట్టబోతోంది. పాత భవనం, శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Jagga Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ జగ్గారెడ్డి కీలక నిర్ణయం

దసరా పండగ నాడు ఉస్మానియా ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి పడింది.ఉస్మానియా ఆస్పత్రిని హైదరాబాద్ గోషామహల్ స్టేడియానికి తరలించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో దసరా పండగ నాడు ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. దసరా పర్వదినం సందర్భంగా అధికారికంగా బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు.

Osmania Hospital

ఎంఈఐఎల్ డైరెక్టర్ కె.గోవర్ధన్ రెడ్డి గురువారం, దసరా పండగ నాడు శాస్త్రోక్తంగా పూజలు చేసి ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ నిర్మాణ పనులను (Hospital building construction work) అధికారికంగా ప్రారంభించారు. పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుకున్న సమాయానికే ఉస్మానియా భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

నూతన అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని

ప్రైవేటు ఆస్పత్రలకు ధీటుగా.. అన్ని నూతన అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తాము అన్నారు.గోషామహల్ స్టేడియం (Goshamahal Stadium) లో సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆస్పత్రి భవనాలు నిర్మించనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 31న దీనికి శంకుస్థాపన చేశారు.

ప్రతి భవనాన్ని 12 అంతస్తులుగా నిర్మించబోతున్నారు. 2,000 పడకల సామర్థ్యం దీన్ని నిర్మిస్తున్నారు. ప్రతి భవనం బేస్‌మెంట్‌లో రెండు అంతస్తుల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండు సంవత్సరాల్లో ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పనులు శరవేగంగా సాగుతాయని అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News dasara foundation stone goshamahal stadium Hyderabad News latest news osmania hospital osmania hospital construction osmania hospital new building Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.