రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళా కానిస్టేబుల్ (Female constable) పురుగుల మందు తాగి ఆత్మహత్య (Sucide) కు పాల్పడినట్లు సమాచారం. మృతురాలు 2020 బ్యాచ్‌కు చెందిన 28 ఏళ్ల మనీషా, గత ఐదేళ్లుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ కలహాలే ఆత్మహత్య కారణం
వారం రోజుల క్రితం, మనీషా నంది హిల్స్ (Nandi Hills) ప్రాంతంలోని తన నివాసంలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆమెను అపస్మారక స్థితిలో కనుగొని, వెంటనే నాంపల్లి ప్రాంతంలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమెను వైద్యులు అత్యవసర చికిత్సకు అందించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల అనంతరం మనీషా కన్నుమూశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భర్త వేధింపుల అనుమానం
మనీషా భర్త వేధింపుల కారణంగానే ఈ దారుణమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మహిళా కానిస్టేబుల్ ఎవరు?
ఆమె పేరు మనీషా. ఆమె 2020 బ్యాచ్‌కు చెందినవారు మరియు మీరపేట్ పోలీస్ స్టేషన్, రంగారెడ్డి జిల్లా పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆమె ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం?
కుటుంబ కలహాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. భర్త వేధింపులే కారణమవచ్చునని ఆమె కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: