📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Gruha Jyothi : గ్రేటర్ లో విస్తృతంగా గృహజ్యోతి లేఖల పంపిణీ

Author Icon By Sudheer
Updated: January 13, 2026 • 9:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తేదీ:13.01.2026: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహ జ్యోతి – 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం దాదాపు రెండేళ్లుగా విజయవంతంగా అమలవుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను చాటిచెప్పేందుకు, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు గృహ జ్యోతి లబ్ధిదారులకు వారి పేర్లతో వ్యక్తిగతంగా లేఖలు రాశారు.

ఈ లేఖలను TGSPDCL అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 11 లక్షల గృహ జ్యోతి లబ్ధిదారులకు ఈ లేఖలు పంపిణీ చేస్తున్నారు. లేఖలలో ప్రతి వినియోగదారుడి పేరు, సర్వీస్ నంబర్ పొందుపరిచి ఉండటం విశేషం.

Siddipet: దుంపలపల్లి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన

లేఖలో, ఉచిత విద్యుత్ వల్ల వినియోగదారులకు ఆదా అవుతున్న మొత్తాన్ని పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

వినియోగదారుల హర్షం: గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ పేరుతో వ్యక్తిగత లేఖ రాయడం, అదీ అధికారులు స్వయంగా ఇంటికి వచ్చి అందజేయడం పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాయో ఈ చర్య స్పష్టంగా చూపిస్తోందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనమని వారు అభిప్రాయపడుతున్నారు.

గృహ జ్యోతి లబ్ధిదారుల వివరాలు:
Circle No. of GJ Bene.
1 బంజారా హిల్స్ 38,837
2 హైదరాబాద్ సెంట్రల్ 74,551
3 సికింద్రాబాద్ 77,296
4 హైదరాబాద్ సౌత్ 1,08,078
5 రాజేంద్ర నగర్ 1,43,216
6 సంగారెడ్డి 2,23,236
7 సైబర్ సిటీ 77,193
8 మేడ్చల్ 1,24,014
9 సరూర్ నగర్ 1,30,162
10 హబ్సిగూడ 1,41,897
total 11,38,480

Google News in Telugu Gruha Jyothi Gruha Jyothi hyderaad hyderabad Latest News in Telugu Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.