📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? : బండి సంజయ్

Author Icon By sumalatha chinthakayala
Updated: March 13, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల ఎకరాల్లో వరి, 7 లక్షల ఎకరాల్లో మొక్కొజొన్న పంటలు వేసినప్పటికీ…. ఆయా పంటలకు తగిన సమయంలో నీటిని వదలకపోవడంవల్ల ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల మేరకు పంట ఎండిపోయినట్లు మా ద్రుష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆయకట్టు చివరి పంటలకు నీళ్లందక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునేందుకు, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం..అని బండి సంజయ్ ఓ ప్రకటనలో చెప్పారు.

కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా?

పాలకుల నిర్లక్ష్యానికి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఇప్పటికే రైతు భరోసా సాయం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రుణమాఫీ పూర్తిగా అమలు కాక 20 లక్షలకుపైగా రైతులు అప్పులు చెల్లించకలేక అల్లాడుతున్నారు. గతంలో పంట నష్టపోతే పరిహారం అందక అరిగోస పడుతున్నారు. రైతు రాజ్యమని బీరాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి ఏం సమాధానం చెబుతుంది? కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటే ఇదేనా? కనీసం రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గం..అని బండి సంజయ్ మండిపడ్డారు.

రైతాంగం పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలి

రాష్ట్రానికి, దేశానికి అన్నం పెడుతున్న అన్నదాత అష్టకష్టాలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే… వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనడంతోపాటు వారికి అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ అంశాన్ని కూడా కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? ప్రభుత్వ అధినేతగా రాజకీయ నాయకుల స్టేచర్ గురించి మాట్లాడి మీడియాలో వార్తలకెక్కడం కాదు… ప్రభుత్వ అధినేతగా రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించి వారికి అండగా నిలవాలి. తక్షణమే రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించాలి. అసెంబ్లీ సాక్షిగా రైతులను ఆదుకునేందుకు ప్రకటన చేయాలి. మరింత నష్టం జరగకుండా వెంటనే ప్రాజెక్టులనుండి నీటిని విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi sanjay Breaking News in Telugu Congress govt Farmers Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.