📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Karimnagar : చనిపోయిన కొడుకు మళ్లీ పుట్టాడు అదేంటి ?

Author Icon By Sudheer
Updated: March 20, 2026 • 11:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విధి ఆడిన వింత నాటకంలో బిడ్డను కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న కరీంనగర్‌కు చెందిన ఒక దంపతుల జీవితంలో అద్భుతం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల క్రితమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఈ దంపతులు, తమ పెద్ద కుమారుడిని ‘HLH’ (Hemophagocytic Lymphohistiocytosis) అనే అరుదైన మెదడు వ్యాధితో కోల్పోయారు. కళ్లముందే కొడుకు ప్రాణాలు విడవడంతో కుంగిపోయిన ఆ తల్లిదండ్రులు, తమ బిడ్డ మళ్లీ తమకే పుట్టాలని బలంగా ఆకాంక్షించారు. ఈ క్రమంలో కరీంనగర్‌లోని డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించగా, వైద్య శాస్త్రం సాయంతో అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. డాక్టర్లు వారికి రీ-ఆపరేషన్ నిర్వహించి, IVF (In-Vitro Fertilization) ప్రక్రియ ద్వారా ఆ తల్లి మళ్లీ గర్భం దాల్చేలా చేశారు.

Read Also : Garikapati Mid Day Meal Comments: గరికపాటి మధ్యాహ్న భోజనం వ్యాఖ్యలపై క్లారిటీ!

సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత పుట్టిన శిశువును చూసి వైద్యులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ఏడాది క్రితం మరణించిన బాబు పోలికలతోనే ఈ చిన్నారి జన్మించడం ఒక ఎత్తయితే, చనిపోయిన బాబుకు ఎడమ చేతిపై ఎక్కడైతే పుట్టుమచ్చ ఉండేదో, సరిగ్గా అదే చోట అదే తరహా మచ్చతో ఈ బాబు పుట్టడం అందరినీ నివ్వెరపరిచింది. ఇది కేవలం పునర్జన్మ అని ఆ తల్లిదండ్రులు భావిస్తుండగా, ఆధునిక వైద్య సాంకేతికత మరియు అచంచలమైన విశ్వాసం కలిసి విధి రాతను తిరగరాశాయని చెప్పవచ్చు. మరణించిన బిడ్డ మళ్లీ అదే రూపంలో తిరిగి రావడంతో ఆ ఇంట మళ్లీ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

born again Karimnagar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.