స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు లభించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో పాల్గొన్న ప్రభుత్వ బృందం జరిపిన విస్తృత చర్చల ఫలితంగా, టాటా గ్రూప్ రాష్ట్రంలో కీలక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా మారేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిగిన సమావేశంలో పలు ముఖ్య ఒప్పందాలు ఖరారయ్యాయి.
Read Also: Urban Forests : తెలంగాణ లో మరో 6 అర్బన్ ఫారెస్ట్ లు
మూసీ పునరుజ్జీవనానికి టాటా చేయూత
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ‘మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు’లో పాల్గొనేందుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. రాజస్థాన్, మహారాష్ట్రల్లో చేపట్టిన నీటి వనరుల పునరుద్ధరణ ప్రాజెక్టుల అనుభవాన్ని మూసీ అభివృద్ధికి వినియోగిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. నది శుభ్రీకరణతో పాటు, మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆర్థిక చట్రంగా రూపుదిద్దే దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
క్రీడలకు టాటా గ్రూప్ అండ
అదేవిధంగా, హైదరాబాద్‌లో క్రీడా మౌలిక వసతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా టాటా గ్రూప్ సహకారం అందించనుంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనతో పాటు, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. అలాగే భద్రాచలం, మేడారం, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సమీపంలో అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రిసార్టులు నిర్మించేందుకు కూడా టాటా గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాలు తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కొత్త దారులు తెరవనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: