మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరాలతో(Weather Updates) ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో గాలులు తీవ్రంగా వీచి చలి మరింతగా అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ సెంటర్ (TSRPS) గ్రానులర్ రిపోర్ట్ ప్రకారం, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో అత్యల్పంగా 12.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతల్లో ఒకటి.
read also: TG: పెరగనున్న చలి..ఈరోజు నుంచి జాగ్రత్త!
చలితో వణికిన పరిసర గ్రామాలు
కొండాపూర్‌తో పాటు ఘట్కేసర్, దేవరయంజాల, మల్కారం, ఉప్పల్, దూలపల్లి ఫారెస్ట్ ఏరియా, అలియాబాద్ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రంగా ఉంది. ఉదయాన్నే పొగమంచు కమ్ముకుని, దృష్టి మందగించడంతో(Weather Updates) వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే రెండు రోజులపాటు మినిమం టెంపరేచర్లు (Minimum temperatures) ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఉత్తర గాలుల ప్రభావంతో రాష్ట్రం అంతటా రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని తెలిపింది.
ఆరోగ్య నిపుణుల సూచనలు
చలికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలని, ఉదయం బయటకు వెళ్లేటప్పుడు వూలెన్ దుస్తులు ధరించాలని సలహా ఇస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: