Weather: తెలంగాణలో చలి తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, రానున్న మూడు రోజుల్లో చలి మరింత తీవ్రతరంగా మారే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో అధిక వర్షపాతం నమోదవడం, ప్రస్తుతం ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావం కారణంగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ (weather) నిపుణులు చెబుతున్నారు. పగటిపూట గాలిలో చల్లదనం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గడం గమనించవచ్చు.
Read also: Weather: హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి..
Weather: మరింత పెరగనున్న చలి తీవ్రత
పగటిపూట కూడా చలి తగ్గకపోవడంతో
హనుమకొండలో ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు, పటాన్‌చెరులో 13.2 డిగ్రీలకు, మెదక్‌లో 14.1 డిగ్రీలకు పడిపోయింది. హైదరాబాద్‌లో 16.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్‌లో 14.2, హయత్‌నగర్‌లో 15.6 డిగ్రీలు నమోదయ్యాయి. పగటిపూట కూడా చలి తగ్గకపోవడంతో రామగుండం, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: