గతవారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు చలికి (cold) వణికిపోతున్నాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నేడు (శుక్రవారం) హైదరాబాద్లో అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు నమోదైంది. దీంతో చలి అమాంతం పెరిగిపోయింది. రాజేంద్రనగర్ లో 10.7, బిహెచ్ ఎల్ లో 11.1, బొల్లారం,మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్ లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read Also: D Mart: డీమార్ట్ కంటే తక్కువ ధరలు.. ఈ స్టోర్ల ఆఫర్లు చూస్తే షాక్!
చలి అమాంతం పెరిగిపోయింది.
వచ్చే మూడునాలుగు రోజులూ ఇదే విధమైన వాతావరణ(weather) పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఈ సీజన్లో(season) జగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా చంటిపిల్లలకు చలిగాలి సోకకుండా జాగ్రతలు తీసుకోవాలి.
సాయంత్రం కాగానే కిటికీ తలుపులను మూసివేసుకోవాలి. అవసరం అయితేనే రాత్రివేళలో వృద్ధులు బయటికి రావాలి. ఒకవేళ వచ్చినా స్వెటర్లు, స్కార్పులు వంటివి వాడాలి. చలిగాలి పిల్లలకు తగలకుండా వారికి అవసరమైన దుస్తులతో కప్పాలి. వేడి నీటిని తాగడం మంచిది. ఆహార నియమాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: