📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Pension : దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచి తీరుతాం – టీవీసీసీ చైర్మన్ వీరయ్య

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో దివ్యాంగుల పెన్షన్ (Pension) రూ.6వేలు కచ్చితంగా పెంచుతామని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఈమేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల్లో దివ్యాంగుల రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ‘దివ్యాంగుల హక్కులు సంక్షేమం, రాజకీయ అవకాశాలు‘ పై రాష్ట్ర సదస్సు జరిగింది. చైర్మన్ వీరయ్య ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచకొంటే తాను పదవికి రాజీనామా చేస్తానని… కేంద్రం రూ.3వేలకు పెన్షన్ పెంచకొంటే తమరు పార్టీ పదవికి రాజీనామా (Resignation from party position) చేసే దమ్ముందా అని బిజెపి (BJP) నేతలకు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 80 శాతం పైబడి అంగవైకల్యం ఉంటేనే దివ్యాంగులగా గుర్తించి, 20 వేల మందికి నెలకు రూ.300 చొప్పున పెన్షన్ ఇస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం 40శాతం పైబడి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు నెలకు రూ.4,016 పెన్షన్ ఇస్తున్నదని తెలిపారు. సమావేశంలో కమిటీ చైర్మన్ షఫీ, వైస్ చైర్మన్ ధ్యనంపల్లిమల్లికార్జున్, ఎన్పీఆర్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు తుడుం రాజేందర్తోపాటు వివిధ జిల్లాల నుంచి 150 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/focus-should-be-placed-on-the-development-of-eco-tourism/hyderabad/529756/

Breaking News in Telugu Latest News in Telugu pension hike telangana government Telugu News tvcc chairman veerayya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.