📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం: మంత్రి ఉత్తమ్

Author Icon By Vanipushpa
Updated: January 22, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈరోజు దరఖాస్తు ఇచ్చినా రేషన్ కార్డు ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా జనవరి 21 నుంచి గ్రామసభలు ప్రారంభమయ్యాయి.

గ్రామసభల్లో కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈనెల 24 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో పెద్దఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. కాగా, ఈనెల 26న నుంచి అర్హులకు రేషన్‌ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేయనుంది. గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేసింది. ఈ సర్వేలో చాలామంది తమకు రేషన్‌ కార్డులు లేవని ఎన్యూమరేటర్లకు తెలిపారు. ఈ విషయాన్ని ఎన్యూమరేటర్లు పైఅధికారులకు చెప్పారు. అయితే తొలుత అంతా కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తారని భావించారు. కానీ గ్రామసభలు పెట్టి నూతన కార్డులు ఇస్తామని మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.

ration card Telangana uttam kumar reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.