📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం – మంత్రి ఉత్తమ్

Author Icon By Sudheer
Updated: February 26, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SLBC టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల్లో ఈ ఆపరేషన్ పూర్తయ్యేలా ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని ఆయన తెలిపారు. టన్నెల్ లోపల ఉన్న పూడికను తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సమగ్ర ప్రణాళికతో రక్షణ చర్యలు

SLBC టన్నెల్ లోపల గ్యాస్ పేరుకుపోవడం, మట్టి కూలిపోవడంతో సహాయక చర్యలు కాస్త సవాలు గా మారాయని మంత్రి పేర్కొన్నారు. అయితే సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించి, అత్యాధునిక పద్ధతుల్లో మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గ్యాస్ కట్టర్ సహాయంతో టన్నెల్ లోపల ఫసుకున్న TBM (టన్నెల్ బోరింగ్ మషీన్)ను వేరుచేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి

ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని, రెండు రోజుల్లో పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అవసరమైన యంత్రాలు, సాంకేతిక నిపుణుల సహాయంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందిస్తున్నదని పేర్కొన్నారు. కార్మికుల భద్రతే ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. టన్నెల్ లోపల ఏర్పడిన సమస్యలను అధిగమించి, సహాయక చర్యలు విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Google news Minister Uttam SLBC Tunnel slbc tunnel Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.