తెలంగాణ బీఆర్‌ఎస్ (BRS) పార్టీకి మళ్లీ అధికారం చేరువలో ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, “ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తూ, పార్టీ బలాన్ని ప్రజలు మళ్లీ గుర్తిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టి విమర్శలు
ఈ సందర్భంగా కేటీఆర్ (KTR), కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందన్నారు. దాంతో పాటు రాష్ట్రంలోని ప్రతి వర్గాన్నీ మోసం చేయడం జరుగుతోంది అని విమర్శించారు. ప్రజలు తమను మళ్లీ మోసగించారని ఎప్పుడో గుర్తిస్తున్నారని తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న మద్దతు
ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని బట్టి చూస్తే పార్టీకి మద్దతు రోజు రోజుకు పెరుగుతుందన్న కేటీఆర్, “ఇదే ధీమాతో పార్టీ కార్యకర్తలు నడవాలి. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ మోసాల్ని ఎండగట్టాలి” అని పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతాయని, తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజలకు నిజమైన పాలన అందిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Heavy Rain Alert in AP : మరో 3 రోజులపాటు వర్షాలు