हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

MLC Kavitha : బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలి: కవిత

sumalatha chinthakayala
MLC Kavitha : బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలి: కవిత

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. హ‌క్కుల కోసం తెలంగాణ నుంచే ఉద్య‌మ పొలికేక మొద‌లైంద‌ని అన్నారు. బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది అని క‌విత పేర్కొన్నారు. బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ప్ర‌క‌ట‌న చేశాను. చట్టసభలు బిల్లలు ఆమోదించిన నేపథ్యంలో కొమురవెల్లిలో మొక్కు చెల్లించుకున్నాను.

బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్‌కు ప్రభుత్వం తలొగ్గి వేర్వేరు బిల్లును పెట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలి. చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలి అని క‌విత పేర్కొన్నారు.

ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం

దేశంలో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా దాదాపు 10 ఉన్నాయి. ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలైన తర్వాత తెలంగాణలో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలిగిపోయిన నేపథ్యంలో కోర్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదించాలి. రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని తొలి నుంచి వాదిస్తున్నాం అని క‌విత తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870