ఇరవై ఏళ్లుగా వరంగల్ (Warangal) ప్రజలు ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన 300 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగించింది. దీంతో చాలా కాలంగా నిలిచిపోయిన ఈ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ విమానాశ్రయం నిర్మాణం మొదలైన రెండేళ్ల నుండి రెండేళ్లన్నర లోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మామునూరు విమానాశ్రయానికి అవసరమైన 300 ఎకరాల భూమిని సేకరించాము అని భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఈ భూమికి పరిహారంగా రూ. 295 కోట్లు చెల్లించింది. 2007లోనే ఏఏఐతో ఒప్పందం కుదిరినా, ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి నిలిచిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.
Read Also: AMRUT 2.0: తెలంగాణలో మరో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
బేగంపేటలో కేంద్ర మంత్రికి డాక్యుమెంట్ల అందజేత
ఈ భూమికి సంబంధించిన (Warangal) పత్రాలను బేగంపేట విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు (Rammohan Naidu) అందజేశారు. విమానాశ్రయ అభివృద్ధికి అయ్యే మొత్తం ఖర్చును ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) భరిస్తుంది.
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ఒక విమానాశ్రయం అందుబాటులో ఉందన్నారు. ఈ క్రమంలో వరంగల్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి, పనులు త్వరగా పూర్తి చేయాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరారు. మరో రెండున్నరేళ్లలో ఇది పూర్తవుతుందని కేంద్రం ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: